మార్చి 15, 2023 మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది . ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ పొదుపు పాటించటం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అంత మంచిది కాదు. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) […]

మార్చి 15, 2023

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆర్థిక
పరిస్థితి బాగుంటుంది . ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ పొదుపు పాటించటం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు
ఇవ్వడం, తీసుకోవడం అంత మంచిది కాదు. అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) :ఈ రోజు అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు .ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ జీవితంలో అపార్ధాలు లేదా విభేదాలు
తలెత్తే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు నిగ్రహం కోల్పోకండి . పిల్లలనుంచి ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
కుటుంబసౌఖ్యం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అనవసర ఖర్చుల జోలికి పోవద్దు . వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసివస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):నిరుద్యోగులకు ఆశ జనకంగా ఉంది.ప్రభుత్వ ఉద్యోగులు బాగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా
సాగిపోతుంది. ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. హామీలకు వీలైనంత దూరంగా ఉండటంమంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):కుటుంబ జీవితంలో కొద్దిగామనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి.
ఇతరులతో వ్యవహరించడంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కోర్టుకేసులు ల్లో పురోగమనం . ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వటం కానీ, తీసుకోవడంకానీ చేయవద్దు. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.శుభ వార్త వింటారు .

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికలాభాలు మిశ్రమం . కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలుతీసుకొని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఆస్తికి సంబంధించిశుభవార్త వింటారు. తోబుట్టువులతో అపార్ధాలు తొలగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1);
ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంటాయి. ఆర్థికంగాఇతరులకు సహాయం కూడా చేస్తారు. కొందరు మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన
వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగాసాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
వీసా పనులు వేగవంతం అవుతాయి. . వ్యాపారంలో సమస్యలు తగ్గుతాయి . ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంటుంది.

కుంభం(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
అదనపు ఆదాయం కలిసి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందిస్తుంది.మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ మాటకు
విలువ పెరుగుతుంది. మీ ప్రాధాన్యం కూడా ఎక్కువ అవుతుంది. స్నేహితులతోవిందులు, విహారాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలనుతలకెత్తుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే
అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంతమేరకు చక్కబడుతుంది. ఇతరులకు మేలుజరిగే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి, తోబుట్టువుల నుంచి ఆశించినసహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Updated On 14 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story