మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆస్తికి సంబంధించిన వివాదలు పరిష్కారం అవుతాయి . ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులకు సమయం . వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు.విద్య వ్యాపారం లో శుభకాలం కనిపిస్తుంది . మిథునం […]

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆస్తికి సంబంధించిన వివాదలు పరిష్కారం అవుతాయి . ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులకు సమయం .

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు.విద్య వ్యాపారం లో శుభకాలం కనిపిస్తుంది .

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగజీవితం లో ఉత్సహం పెరుగుతుంది . నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు మానుకోవాలి ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడాలి .

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు . డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాంకేతిక రంగంలోని వారు ఎంతగానో రాణిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే డబ్బు అందుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పాటించడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగ, వ్యాపార జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. హామీలకుమధ్యవర్తిత్వం కు దూరంగా ఉండండి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో ఒత్తిడి . అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేయటం మంచిది. ఉద్యోగంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కు ఆశాజనకం . ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ విషయాలలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహచరులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. పిల్లల నుంచిశుభవార్తలు వింటారు. ఉద్యోగం లో ప్రశంశలు అందుకునే అవకాశం . వ్యాపారులకు ఆర్థికంగా బాగానే ఉంటుంది.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులలో జాప్యం తప్పదు . కుటుంబంలో మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ జీవితంలో అపార్ధాలు తలెత్తుతాయి.

Updated On 16 March 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story