ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది.

తేదీ:- 9, డిసెంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయనం

ఋతువు:- హేమంత

మాసం:- మార్గశీర్షం

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- నవమి తె.3.23 వరకు

వారం:- సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:- పూర్వాభాద్ర మ.1.16 వరకు

యోగం:- సిద్ధి రా.12.03 వరకు

కరణం:- బాలువ సా.4.29 వరకు తదుపరి కౌలువ తె.3.23 వరకు

వర్జ్యం:- రా.10.14 - 1.43 వరకు

దుర్ముహూర్తము:- మ.12.14 -12.58 వరకు

మరల మ.2.26 - 3.10 వరకు

అమృతకాలం:- ఉ.7.14 వరకు

రాహుకాలం:- ఉ.7.30 - 8.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు

సూర్యరాశి:- వృశ్చికం

చంద్రరాశి:- కుంభం

సూర్యోదయం:- 6.22 సూర్యాస్తమయం:- 5.22

మేషం

ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు.

శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.

వృషభం

ఈ రాశి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. దుర్గా దేవిని పూజించండి.

మిథునం

ఈ రాశి వారికి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మనస్సు చంచలంగా ఉంటుంది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. నవగ్రహ స్తోత్రం పఠించండి.

కర్కాటకం

ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. అమ్మవారిని ఆరాధించండి.

సింహం

ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

కన్య

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. శివారాధన శ్రేయస్కరం.

తుల

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. కుల దైవాన్ని ప్రార్ధించండి.

వృశ్చికం

ఈ రాశి వారికి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. మహా విష్ణువును పూజించండి.

ధనుస్సు

ఈ రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణము చేయండి.

మకరం

ఈ రాశి వారికి చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.

కుంభం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.

మీనం

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మహా లక్ష్మిని పూజించండి.

ehatv

ehatv

Next Story