ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు పరుగుపెట్టేది సంపాదన కోసమే .ఈ డబ్బు అందరికి అందదు .అందుబాటు లో ఉన్నవాళ్ళ దగ్గర నిలవదు.రాబడి బాగానే ఉన్న పొదుపు ఉండదు మరికొందరికి ఇలా ప్రతి ఒక్కరు ఈ డబ్బు విషయం లో ఎదో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. మన జీవితానికి జీవనానికి సంబందించిన ప్రతి చిన్న విషయం కూడా డబ్బు పైనే ఆధారపడి ఉంటుంది. హిందూ సాంప్రదాయ ప్రకారం సంపద ను లక్ష్మి దేవి గా […]

ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు పరుగుపెట్టేది సంపాదన కోసమే .ఈ డబ్బు అందరికి అందదు .అందుబాటు లో ఉన్నవాళ్ళ దగ్గర నిలవదు.రాబడి బాగానే ఉన్న పొదుపు ఉండదు మరికొందరికి ఇలా ప్రతి ఒక్కరు ఈ డబ్బు విషయం లో ఎదో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. మన జీవితానికి జీవనానికి సంబందించిన ప్రతి చిన్న విషయం కూడా డబ్బు పైనే ఆధారపడి ఉంటుంది. హిందూ సాంప్రదాయ ప్రకారం సంపద ను లక్ష్మి దేవి గా కొలుస్తూ ఉంటాం .. మరి ఆ లక్ష్మి దేవి మన చేతుల్లో పది కాలాలపాటు పదిలంగా ఉండాలి అంతే ఏం చేయాలి ..జోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు అనుకూలం గ లేని సమయాల్లో ఎదురయ్యే సమస్యలు వలన కూడా సంపద నిల్వ కుండా పోతుందని చెబుతున్నారు. మరి 12 రాశులు వారు ఎం చేస్తే తమ సంపదను పెంచుగోలరు ఆదా చేసుకోగలరు అనేదానికి కొన్ని పరిష్కారాలనైతే ఇప్పుడు చూద్దాం .

మేష రాశి :ఈ రాశి వారు పేదలకు డబ్బు దానం చేయాలి. పేదలకు దానం చేయటం వలన మీ దగ్గర డబ్బు నిలపడుతుంది. సంపద పెరుగుతుంది .

వృషభం:నల్ల నువ్వులను శని దేవునికి నైవేద్యం గా సమర్పించాలి .ఇలా చేస్తే మీకు లక్ష్మి దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది

మిధునం : అనారోగ్య సమస్యలు పడుతున్నవారికి సహాయాన్ని అందించాలి .ఇలా చేయటం వల్ల డబ్బు సమస్యలు తగ్గుతాయి .

కర్కాటకం:కొత్త బట్టలు లేదా కొత్త చెప్పుల్ని దానం చేయాలి . ఇలా దానం చేయటం వల్ల ఆదాయం పెరుగుతుంది .

సింహం :మీ ఆదాయం దృష్ట్యా తినే పదార్దాలను పేదలకు దానం చేయటం వలన మీ డబ్బు ఆదా చేసుకోగలరు .

కన్య :శనివారం రోజు ఆవల నూనె ,బెల్లాన్ని శని కి సమర్పించాలి . ఇలా చేస్తే శని ప్రభావం తగ్గి ఖర్చులు తగ్గుతాయి .

తులా :ఎవరైనా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయాలి . ఆలా చేయటం వలన మీ సంపద రెట్టింపు అవుతుంది.

వృశ్చికం :వయసులో పెద్దవారికి ,ముసలి వాళ్ళకి దానం కానీ సహాయం కాని అందిస్తే లక్ష్మి దేవి కటాక్షం సిద్ధిస్తుంది .

ధనస్సు :చిన్నపిల్లలలకు ఆట వస్తువులని దానం గా ఇవ్వటం మంచిది . అనుకున్న సమయానికి డబ్బులు అందుతాయి .

మకరం:శని ప్రభావాన్ని తగ్గించుకొనేందుకు నువ్వలా నూనెతో శనికి అభిషేకం జరపాలి . శని ప్రభావం తగ్గి కలవాల్సిన డబ్బు చేతికి వస్తుంది .

కుంభం: విరాళనని ఇవ్వాలి .మీ సంపదలో కొంత భాగాన్ని విరాళాలు గ ఇవ్వటం మంచిది .

మీనం :పేదలకు అన్నదానం ,నిరుపేదలకు కొత్త బట్టలు కొన్నివటం వంటివి చేయటం వల్ల డబ్బు సమస్యలు తీరగలవు ..

గమనిక : పైన్ ఇవ్వబడిన సమాచారం కొంతమంది జోతిష్య నిపుణుల సలహా మేరకు ఇవ్వటం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాల దృష్ట్యా నిర్ణయింపబడలేదు .దయచేసి గమనించగలరు .

Updated On 23 Feb 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story