ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 5 ​​గంటల 24 నిమిషాలు. అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు,ఇక్కడి వారు నియమాలు పాటించనవసరం లేదు . కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 3 రాశుల వారు సూర్యగ్రహణం ప్రభావంతో కెరీర్ ఇంకా కుటుంబ విషయాలలో అనుకోని ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటారు. అవి ఏ రాశులంటే ?

మేష రాశి : ఈ రాశి వారికి సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది . ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే మీరు డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఏ పనిని చేయవద్దు లేదా ఏదైనా కొత్తదాన్ని కొనుగోలు చేయకూడదు . భూమి ఆస్తికి సంబంధించి ఎలాంటి డీల్ చేయవద్దు. ఈ రాశివారికి మానసిక , శారీరక బాధలు పెరుగుతాయి. ఉద్యోగం ఇంకా వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. నివారణగా, ప్రతిరోజూ సూర్యునికి నీటిని సమర్పించండి.అలాగే సూర్యనికి నమస్కారం చేయండి .

సింహ రాశి:సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యగ్రహణం ప్రభావం కారణంగా, ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. అకస్మాత్తుగా మీ ఖర్చులు పెరగవచ్చు కుటుంబంలో కూడా విభేదాలు రావచ్చు . నివారణగా రాగి పాత్రలో రోజూ నీటిని తీసుకుని అందులో మందార పువ్వులు వేసి సూర్యునికి సమర్పించాలి.

కన్యారాశి :ఈ రాశి వారు సూర్యగ్రహణం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో భారీ నష్టాలు చూసే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు . పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు . గ్రహణం ప్రభావం వైవాహిక జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది . గొడవలు పెరుగుతాయి . మీ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది . పరిహారంగా ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించి గోవుకు అరటిపళ్ళు తినిపించండి.

సూర్యగ్రహణం సమయంలో ప్రజలందరూ కొన్ని నియమాలను పాటించాలి. భారత దేశంలో గ్రహణ ప్రభావం లేనప్పటికీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఈ పనులు చేయటం వలన అందరికి మంచిది . సూర్యగ్రహణం సమయంలో విష్ణుసహస్త్రా పారాయణం చేయటం మంచిది . దేవాలయాలలోకి వెళ్ళద్దు , జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంచిన విగ్రహాలను పూజ చేయకండి .

Updated On 19 April 2023 5:07 AM GMT
rj sanju

rj sanju

Next Story