Lucy Time For 6 Rasis : వందేళ్ల తర్వాత మహత్తర యోగం.. ఆరు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం!
జాతీయ పండుగ అయిన దీపావళికి(Depavali) వారం రోజుల సమయమే ఉంది.
జాతీయ పండుగ అయిన దీపావళికి(Depavali) వారం రోజుల సమయమే ఉంది. అయిదు రోజుల పాటు భారతీయులు(Indians) జరుపుకునే ఈ పండుగకు ముందు అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. గురు పుష్య యోగం(Gurupushya yogam) గురువారం ఏర్పడింది. ధన త్రయోదశి రోజున అంటే అక్టోబర్ 29వ తేదీన ఏకంగా అయిదు యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగం వ్యాపారంలో అభివృద్ధిని, లాభాలను కలిగిస్తుంది. కొన్ని రాశుల వారి ఆదాయం బాగా పెరగనుంది. ధంతేరాస్ రోజున గ్రాహి, త్రిపుష్కర, వైధ్రీ, ఇంద్ర వంటి అనేక యోగాలు ఏర్పడతాయని పంచాంగకర్తలు అంటున్నారు. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం కూడా ఈ రోజున వస్తుంది. అందు వల్ల దీపావళి పండుకకు ముందే ఈ రాశుల వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.
మేషం(Mesham)
ఈ రాశివారికి ఈ యోగాలు అదృష్టాన్ని పెంచుతాయి. పారిశ్రామికవేత్తలకు శుభకాలం. అదృష్ట సమయం. కోరికలు నెరవేరే కాలం. కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారాలలో విజయం చేకూరుతుంది. నిలిచిపోయిన పనులు శీఘ్రగతిన పూర్తవుతాయి.
వృషభం(Vrushbam)
ఈ రాశివారికి జీవితంలో పురోగతిని తెస్తాయి. దీపావళికి ముందు తమ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన విజయం సాధిస్తారు. జీవితం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం(Karkatakam)
ఈ రాశివారికి ఈ యోగం ఆర్ధికపరమైన లాభాలను కలిగిస్తుంది. మీ వ్యాపారంలో ఆకస్మిక పురోగతి ఉంటుంది. బంగారు, వెండి ఆభరణాల వ్యాపారులకు ఈ కలయిక ఆదాయంలో ఊహించని పెరుగుదలను తెస్తుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబం, సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహం (Simham)
ఈ రాశివారికి యోగం వల్ల చాలా అదృష్టం ఉంటుంది. వ్యాపారంలో కోరుకున్న ఫలితాలను పొందడం వలన మీ సంపద పెరుగుతుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి లేదా సొంతంగా సంస్థలు నడుపుతున్న వారికి ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కన్య(Kanya)
ఈ రాశివారు రియలెస్టేట్‌పై పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం ఇదే అనువైన సమయం. సంపద పెరిగే అవకాశం ఉంది. ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. సుఖశాంతులు కలుగుతాయి. మీ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.
ధనస్సు (dhanusu)
ఈ రాశివారు విద్యార్థులైతే ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి ఇది అనువైన కాలం . మీరు ఏదైనా చట్టపరమైన సమస్యను ఎదుర్కొంటున్నవారు ఉపశమనం పొందవచ్చు. పురోగతి కొత్త మార్గాలు మీ జీవితంలో తెరచుకుంటాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది.