ప్రస్తుత కాలంలో చాలా మంది అప్పుగా గాని చే బదులు గాని డబ్బు ఇస్తున్నారు ఉంటారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది అప్పుగా గాని చే బదులు గాని డబ్బు ఇస్తున్నారు ఉంటారు. ఎదుటివారి ఆపదలో ఉన్నారని లేదా వడ్డీ వ్యాపారం చేస్తే మరింత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని ఏదైనా కారణంతో ఎదుటివారికి అప్పులు ఇస్తుంటారు. జాతకరీత్యా కొంతమందికి వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది. మరికొంతమంది వడ్డీ వ్యాపారంలో నష్టపోతుంటారు. వడ్డీ వ్యాపారం కలిసి వచ్చే జాతకాలు ఉన్నప్పటికీ జాతకంలో చిన్నచిన్న దోషాలు కారణంగా డబ్బులు కొంత మందికి వెనక్కి రావు. దీనితో మానసికంగా బాధపడడం డబ్బు తీసుకున్న వారితో గొడవలు పడడం, కోర్టు కేసులు వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారి దగ్గర డబ్బు ఉండి కూడా తొందరగా బాకీ తీర్చరు. మరి కొంతమంది మంచి మనసు ఉన్నప్పటికీ బాకీ తీరుద్దాము అనుకునే సమయానికి చేతిలో ఉన్న డబ్బుకి మరొక అవసరం వస్తుంది. ఇటువంటి సందర్భాలు డబ్బు ఇచ్చిన వారి జాతకంలో దోషాలు ఉన్న కారణంగా ఎదుటివారి నుండి డబ్బు తిరిగి వసూలు కాదు. జాతకంలో గురుడు శుక్రుడు రాహువు ఉన్న స్థితి ఆధారంగా డబ్బు తిరిగి వసూలు కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ డబ్బు తిరిగి వసూలు కాదు. ఇటువంటివారు మూడు పరిహారాలు పాటిస్తే డబ్బు తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి జాతకులు లెదర్ పర్సులు వాడరాదు. లెదర్ బ్యాగులలో డబ్బులు కానీ ఆఫీసుకు సంబంధించిన లేదా వ్యాపారానికి సంబంధించిన రసీదులు పేపర్స్ వంటివి ఉంచరాదు గృహంలో కానీ ఆఫీసులో కానీ వ్యక్తిగతంగా గాని లెదర్ పర్సులు లెదర్ బ్యాగులు ఎటువంటి పరిస్థితుల్లో వాడరాదు. కాంపౌండ్ లోపల మల్లె మొక్క కానీ జాజి పూల మొక్క గాని పెంచండి. ఈ మూడు నియమాలు పాటిస్తే మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. జాతకంలో గురు శుక్ర రాహు గ్రహ సంపత్తి అనుకూలంగా లేకపోతే అప్పుగా ఇచ్చిన సొమ్ము వెనక్కి రాదు. ఇటువంటి జాతకులు అప్పులు ఇవ్వరాదు.

ehatv

ehatv

Next Story