కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో(Jammu kashmir) ఆరేళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన(president rule) ఎత్తివేశారు.

కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో(Jammu kashmir) ఆరేళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన(president rule) ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సంతకం చేశారు. పదేళ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఒమర్‌ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీలో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.

Eha Tv

Eha Tv

Next Story