ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య (Polala Amavasya)అంటారు.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య (Polala Amavasya)అంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. పెళ్ళైన మహిళలు సత్సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా ఆడపిల్ల సంతానంగా కావాలనుకునే వారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేయాలని పెద్దలు అంటారు. అమావాస్య తిథి ఈ రోజు (Monday) తెల్లవారు ఝామున 5:30 నిమిషాలకు మొదలై, ఆ తర్వాత రేపటి రోజు అంటే సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం ఉదయం 7:25 నిమిషాల వరకు ఉంది. కానీ ఈ పూజ చేయాలంటే రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి. సోమవారం రోజు పోలాల అమావాస్య పూజను చేసుకోవాలి.

ఈ రోజుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే..మరికొన్ని ప్రాంతాల్లో భాద్రపద అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజుని మహారాష్ట్రలో పిరోరి అమావాస్య అని, ఉత్తర భారతదేశంలో హాలియా అమావాస్య అని అంటారు..

ehatv

ehatv

Next Story