జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి. వ్యక్తుల రాశిచక్రాన్ని వారి జన్మ నక్షత్రం ప్రకారం నిర్ణయిస్తారు. ఈ జన్మ రాశుల అధారంగా వ్యక్తి భవిష్యత్తు, వర్తమానం గురించి జ్యోతిషులు జాతకం తెలియజేస్తారు. అయితే ఈ రాశులను బట్టి వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దా౦. మేషరాశి: ఈ రాశివారికి ఓపిక , సహనం చాలా తక్కువ కోపం ఎక్కువగా ఉంటుంది .నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చూడటానికి కటినంగా కనిపిస్తారు ..కానీ వీరు చాలా సున్నిత […]

జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి. వ్యక్తుల రాశిచక్రాన్ని వారి జన్మ నక్షత్రం ప్రకారం నిర్ణయిస్తారు. ఈ జన్మ రాశుల అధారంగా వ్యక్తి భవిష్యత్తు, వర్తమానం గురించి జ్యోతిషులు జాతకం తెలియజేస్తారు. అయితే ఈ రాశులను బట్టి వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దా౦.

మేషరాశి:
ఈ రాశివారికి ఓపిక , సహనం చాలా తక్కువ కోపం ఎక్కువగా ఉంటుంది .నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చూడటానికి కటినంగా కనిపిస్తారు ..కానీ వీరు చాలా సున్నిత మనస్కులు. వీరు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా ఉంటారు .

వృషభ రాశి:
వృషభ రాశి వారు చాలా సౌమ్య స్వబావం కలిగి ఉంటారు .ఎవరికైన సాయం చేయాలిసి వస్తే ముందు౦టారు.వీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఏ విషయం లో నిర్లక్ష్యం గా ఉండరు .

మిథున రాశి:
చురుకుదనానికి మారుపేరు ఈ రాశివారు .విలాస వస్తువులకై విరివిగా డబ్బు ఖర్చు చేస్తారు. ఎవరినైనను నమ్ముతారు. ఒక్కోసారి మోసపోవుతుంటారు. అన్ని స్థితుఅ లోనూ సమభావం చూపుతారు.. సర్దుబాటు స్వభావం, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు.

కర్కాటక రాశి:
ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ, మనోధైర్యము కలిగిన ఉంటారు. రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు . వీరు మంచి వినయవిధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి.

సింహ రాశి:
ఈ రాశిలో జన్మించినవారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది. కొత్త, పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు. ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులు. అంతేకాకుండా స్వభావరీత్యా వీరు అత్యంత ధైర్యవంతులు.

కన్య రాశి:
కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడుతారు. ఏ విషయంలో నైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన ఇటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. . అనుమానం కూడా ఈరాశివారికి సహజ సిద్ధమైన లక్షణం. మహిళలయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు.

తుల రాశి:
అధిపతి శుక్రుడు.. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగి పోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు. ఎత్తులకుపై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలొ రాణిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు.చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు .ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు .స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది.

మకర రాశి:
ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు. . వీరు కష్టపడి పనిచేస్తారు . స్వతంత్రులుగా ఉండటానికి, స్వంతంగా పని చేయడానికి ఇష్టపడుతారు. వీరు చాలా నమ్మకమైన వారు. నిబద్ధత కలిగిన వ్యక్తులు. వీరు తమ ప్రియమైనవారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయిలోనైనా వెళ్తారు. ఎవరినీ నిరాశపరచరు. వీరు క్రమశిక్షణ, సహనం కలిగి ఉంటారు

కుంభ రాశి:
ఈ రాశివారు బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు. అవేశం, ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. . విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి. .

మీన రాశి:
ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒక వేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్ధ్యం, స్థిరత్వం ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. . వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్ధ్యంగా వృద్ధి చేస్తారు.

Updated On 17 Feb 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story