ప్రతి వ్యక్తి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆశ , ఆరాటం రెండు సాధారణంగా ఉంటాయి . ఇందులో మొదట జీవితం, వృత్తి ఆ తర్వాతే మిగతా విషయాల గురించి తెలుసుకుంటారు . అయితే భవిష్యత్తును తెలుసుకోవడానికి వివిధ రకాల జాతక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జాతకం తెలుసుకోవడానికి పుట్టిన తేది , సమయం కరెక్ట్ గా తెలియనపుడు హస్త సాముద్రిక నిపుణుని సంప్రదిస్తాం .హస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు […]

ప్రతి వ్యక్తి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆశ , ఆరాటం రెండు సాధారణంగా ఉంటాయి . ఇందులో మొదట జీవితం, వృత్తి ఆ తర్వాతే మిగతా విషయాల గురించి తెలుసుకుంటారు . అయితే భవిష్యత్తును తెలుసుకోవడానికి వివిధ రకాల జాతక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జాతకం తెలుసుకోవడానికి పుట్టిన తేది , సమయం కరెక్ట్ గా తెలియనపుడు హస్త సాముద్రిక నిపుణుని సంప్రదిస్తాం .హస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళగా చెప్పవచ్చు, దీనిని అరచేతి పఠనం లేదా చిరోలాజీ అని కూడా పిలుస్తారు. ఈ విధానం పలు సాంస్కృతిక వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. సాముద్రికాన్ని సాధన చేసిన వారిని సాధారణంగా హస్తసాముద్రికులు , అరచేతిని చదవగలిగేవారు , లేదా సాముద్రికులు అని పిలుస్తారు.

హస్త సాముద్రిక౦ అనేది ఎంత వరకు వాస్తవ౦ :

హస్తసాముద్రికం లో వ్యక్తి యొక్క అరచేతి ని “అర్థం చేసుకోవడం” ద్వారా ఆ వ్యక్తి వ్యక్తిత్వం లేదా భావి జీవితం గురించి విశ్లేషించే విధానం ఉంటుంది. ఒక వ్యక్తి అర చేతిలోని పలు “రేఖలు , కొన్ని సాధారణ గుర్తులు మరియు పంక్తులు సూచనలుగా ఉంటాయి. ఈ పంక్తులు వారి వ్యక్తిత్వానికి సరిపోయేలా వృత్తిపరమైన జీవితాన్ని కూడా అంచనా వేయవచ్చని నిపుణులు చెపుతున్నారు . వీటి ద్వారా ఒక వ్యక్తి వారి వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి, మరియు సాధిస్తాడు అని బలంగా చెప్పడానికి దోహదం చేస్తాయని హస్త సాముద్రిక నిపుణులు చెపుతున్నారు . అంతే కాదు వాస్తవ ఫలితాలను అందిస్తూ అందరి నమ్మకాన్ని పొందుతూ ఉందంటున్నారు . వ్యక్తి యొక్క జీవన విధానాలను మరికొంత అభివృద్ధి పధంలో నడిపేందుకు, మానసికంగా వారిలో చైతన్యాన్ని నింపేందుకు, జ్యోతిష్య శాస్త్రం వలెనే హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఎంతగానో సహాయం చేస్తుందని నిపుణుల అభిప్రాయం .

హస్త సాముద్రిక శాస్త్రం పై విమర్శలు :

ఒక వైపు ఈ హస్త సాముద్రిక శాస్త్రం పురాతన కాలం నుండి ఆచరిస్తున్న గొప్ప శాస్త్రంగా చెప్పబడింది . అయితే మరో వైపు ఈ శాస్త్రంపై విమర్శలు చేసేవాళ్ళు లేకపోలేదు .పంచాంగము అంటే తిథి వారం నక్షత్రం, యోగం, కరణం అనే అయిదింటిని చెప్పేది. ఈ ఐదు అంగాలనూ చెప్పడానికి గ్రహాలు నక్షత్రాలు సూర్యచంద్రులు మొదలైన వాటి స్థానాన్ని బట్టి చెప్తారు. కాబట్టి ఇది తప్పు అయ్యే ప్రశ్న లేనేలేదు. హస్త సాముద్రికము అనేది చేతి రేఖలని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు, ఆ వ్యక్తికి జరిగిన, సుమారుగా జరగబోయే ఘటనలు చెప్పుతుంది. ఇంతకీ హస్తసాముద్రికానికి శాస్త్రీయత ఉందా? అందులో ఎంతవరకు వరకు కచ్చితత్వం ఉంటుంది అనే సందేహాలు కూడా వ్యక్త పరిచే వాళ్ళు కూడా లేకపోలేదు .. ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒకేలా ఉండవు . అదేమాదిరి హస్తరేఖలు కూడా ఏ ఇద్దరికీ ఒకే లాగా ఉండవు . అయితే. ఈ రేఖలు జీవన ప్రయాణాన్ని సూచిస్తాయా, లేక ప్రకృతి పరంగా వచ్చిన పిచ్చి గీతలా అన్న సంగతి వాదోపవాదాలకు దారి తీస్తోంది .భవిష్యత్తు సూచనలు కొన్ని సార్లు జరుగుతాయి కొన్నిసార్లు జరగవు. ఇది శాస్త్రంలో లోపమా లేక చెప్పిన వారిలో లోపమా అన్నది చాల మందిలో తలేతుతున్న ప్రశ్న . ఏది ఏమైనా జాతకాలు లేదా హస్త సాముద్రిక శాస్త్రం అయిన మరేదైనా వీటిలో ఎవరి నమ్మకాలూ వారివి అనే చెప్పుకోవాలి

Updated On 17 Feb 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story