ఆర్ధిక ఫలితాలు బాగుంటాయి!

తేదీ:- 12, అక్టోబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధినామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- దశమి తె.4.09 వరకు

వారం:- శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:- శ్రవణం రా.12.42 వరకు

యోగం:- ధృతి రా.9.46 వరకు

కరణం:- తైతుల సా.4.54 వరకు తదుపరి గరజి తె.4.11 వరకు

వర్జ్యం:- ఉ.శే.వ.6.51 వరకు మరల తె.4.35 నుండి

దుర్ముహూర్తము:- ఉ.5.55 - 7.28

అమృతకాలం:- మ.2.38 - 4.11

రాహుకాలం:- ఉ.9.00 - 10.30

యమగండ/కేతుకాలం:- మ.1.30 - 3.00

సూర్యరాశి:- కన్య

చంద్రరాశి:- మకరం

సూర్యోదయం:- 5.55 సూర్యాస్తమయం:- 5.39

విజయదశమి & శమీపూజ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలతో...

దినఫలాలు : ఈ రాశివారికి ఆర్ధిక ఫలితాలు బాగుంటాయి!

మేషం

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. అమ్మవారి ఆరాధన శుభప్రదం.

వృషభం

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలు శక్తిని ఇస్తాయి. తోటివారితో సౌమ్యంగా వ్యవహరించండి, మేలు జరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని పూజించండి. శుభం కలుగుతుంది.

మిథునం

ఈ రాశివారు ఇవాళ కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శివాలయ సందర్శన శ్రేయస్కరం.

కర్కాటకం

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రునాశనం ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

సింహం

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

కన్య

ఈ రాశివారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త . శివారాధన మంచిది.

తుల

ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విజయదశమి మీకు శుభాలను ఇస్తుంది.

వృశ్చికం

ఈ రాశివారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

ధనుస్సు

ఈ రాశివారు చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. మహాలక్ష్మిని పూజించండి.

మకరం

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

కుంభం

ఈ రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

మీనం

ఈ రాశివారు తాము ప్రారంభించిన పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి.కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. అమ్మవారిని కొలవండి

Eha Tv

Eha Tv

Next Story