Daily Horoscopes: ఈ రాశి వారికి అన్ని దిగ్విజయాలే!
ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడటారు.
తేదీ:- 4, డిసెంబరు 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయనం
ఋతువు:- హేమంత
మాసం:- మార్గశిర మాసం
పక్షం:- శుక్ల పక్షం
తిథి:- తదియ మ.12.21 వరకు
వారం:- బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:- పూర్వాషాఢ సా.5.11 వరకు
యోగం:- గండం మ.2.38 వరకు
కరణం:- గరజి మ.12.21 వరకు తదుపరి వణిజ రా.12.05 వరకు
వర్జ్యం:- రా.1.10 - 2.46
దుర్ముహూర్తము:- ఉ.11.27 - 12.11 వరకు
అమృతకాలం:- మ.12.18 - 1.56 వరకు
రాహుకాలం:- మ12.00 - 1.30 వరకు
యమగండ/కేతుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:- ధనుస్సు
సూర్యోదయం:- 6.19 సూర్యాస్తమయం:- 5.20
మేషం
ఈ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అమ్మవారిని భక్తితో పూజించండి.
వృషభం
ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తోలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. భగవన్నామ స్మరణ మరవకండి.
మిథునం
ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడటారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. నవగ్రహ స్తోత్రం పఠించండి.
కర్కాటకం
ఈ రాశి వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శివారాధన చేస్తే మంచిది.
సింహం
ఈ రాశి వారు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
కన్య
ఈ రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. మహాలక్ష్మి దేవి స్తోత్రం చదవండి.
తుల
ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తవహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చికం
ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.
ధనుస్సు
ఈ రాశి వారికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి.
మకరం
ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆంటకాంలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆలయ సందర్శన శుభం.
కుంభం
ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురువుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.
మీనం
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. కుల దైవాన్ని కొలవండి.