ఈరోజు నిండు పున్నమి. రాఖీ పూర్ణిమ(Rakhi Purnima).ఇవాళ అంతరిక్షంలో అద్భత దృశ్యం కనిపించనుంది.

ఈరోజు నిండు పున్నమి. రాఖీ పూర్ణిమ(Rakhi Purnima).ఇవాళ అంతరిక్షంలో అద్భత దృశ్యం కనిపించనుంది. ఆకాశంలో చంద్రకాంతి 30 శాతం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు కూడా 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. ఈ రోజు మాత్రమే చంద్రుడు ఆకాశంలో ఇలా కనిపిస్తాడు. ఇలా కనిపించడాన్ని స్టర్జన్‌ సూపర్‌మూన్‌(Super Moon) అంటారు. రాత్రి 11.55 గంటలకు చందమామ అతి పెద్దదిగా కనిపిస్తాడు. ప్రకాశవంతమైన వెన్నెలను కురిపిస్తాడు. నిజానికి బ్లూ సూపర్‌ మూన్‌ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది నెలవారీ బ్లూ మూన్. అంటే ప్రతి రెండవ వారానికి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. రెండవ సీజనల్ బ్లూ మూన్ ఒక సీజన్‌లో కనిపించే నాలుగు పౌర్ణమిలలో మూడవది. మొదటి పున్నమి జూన్ 22 వ తేదీన జరిగింది. తరువాత రెండవది జూలై 21వ తేదీన, మరి ఇప్పుడు మూడవది ఆగస్టు 19వ తేదీన. అంటే ఈ సీజన్‌లో ఇది మూడో బ్లూ మూన్. దీని తర్వాత సెప్టెంబర్ 18వ తేదీన హార్వెస్ట్ మూన్ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన విషువత్తు. NASA ప్రకారం, సీజనల్ బ్లూ మూన్ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఇలా అక్టోబర్ 2020, ఆగస్టు 2021, ఇప్పుడు దీని తర్వాత వచ్చే సీజనల్ బ్లూ మూన్ మే 2027లో కనిపిస్తుంది. మీరు దీన్ని చాలా ఈజీగా చూడవచ్చు. చంద్రుడి ఉపరితలాన్ని చూడాలంటే మాత్రం టెలిస్కోప్ కావాల్సిందే!

ehatv

ehatv

Next Story