వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy) ఓ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు.

వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy) ఓ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకుపోవడంతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారని చెప్పుకుంటున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 8(Big Boss 8) మరికొద్ది రోజుల్లో టెలికాస్ట్ కాబోతున్నది. ఇప్పటికే పార్టిసిపెంట్లు ఎవరన్నది నిర్వాహకులు ఫిక్స్‌ చేసుకున్నారు. విష్ణు ప్రియ(Vishnu Priya), రీతూ చౌదరి(Rithu Chowdhary), సోనియా సింగ్(Sonia Singh), కుమారీ ఆంటీ(Kumari aunty), హీరో రోహిత్(Hero Rohit)లాంటి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరంతా దాదాపు ఫిక్స్ అయినట్టే.. అయితే వేణుస్వామి పేరు కూడా బాగానే వినిపించింది. నిజానికి ఈయన పేరు టాప్‌ -5లోనే ఉందట! స్టార్‌ మా నిర్వాహకులు ఈయనను సంప్రదించారట కూడా! ఇప్పుడు వేణుస్వామి ఓ వివాదంలో తలదూర్చడంతో ఎందుకైనా మంచిదని ఆయనను తప్పించారట! నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobitha)ఎంగేజ్‌మెంట్‌ సమయంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నిశ్చితార్థం జరిగిన వెంటనే ఎంగేజ్‌మెంట్‌ టైమ్‌ బాగోలేదని, వారిద్దరు విడిపోతారంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు వేణుస్వామి. ఇక్కడితో ఆయన ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ మరిన్ని వివాదాల్లో ఇరుక్కుపోయారు. జర్నలిస్టులతో పెట్టుకున్నారు. నిజానికి బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇలాంటి వివాదాస్పద వ్యక్తులకే చోటు ఉంటుంది. నిర్వాహకులు ఇలాంటి వారిని వెతికి మరీ హౌజ్‌లోకి తీసుకొస్తారు. వేణుస్వామిని మాత్రం సైడ్‌ చేస్తున్నారు. పోయిపోయి ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున ఫ్యామిలీతో పెట్టుకున్నారు వేణుస్వామి.

ehatv

ehatv

Next Story