Astrologer Venu Swamy : అవునా.. నిజమా..!! భూకంపంపై ''వేణుస్వామి'' చెప్పిందే నిజమైందా..!
సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్లకు జ్యోతిష్యం చెబుతూ బాగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం చెప్పడంతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు ఇవన్నీ ఆయనకు బాగా ప్రాచుర్యాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. సినిమా షూటింగ్‌లకు ముహూర్తాలు పెట్టేవాడు. ముఖ్యంగా నాగచైతన్, సమంత పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదని జ్యోతిష్యం చెప్పారు. ఆ తర్వాత నిజంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. దీంతో ఇదిగో నేను ముందే చెప్పాను కదా అని మళ్లీ వీడియోలు చేసి పెట్టాడు. అలా లైమ్ లైట్ లోకి వచ్చిన వేణుస్వామి.. ఆ తర్వాత పలు సెలబ్రిటీల జాతకం చెప్తూ ఫేమస్ అయ్యాడు. ఇక ప్రభాస్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో కాస్త నిజం కావడంతో ఆయన మాటలు చాలా మంది నమ్మారు. అయితే నాగచైతన్య-శోభిత కూడా విడిపోతారు అని చెప్పడంతో సినీ ఇండస్ట్రీ భగ్గుమంది. మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీంతో మహిళా కమిషన్‌కు వెళ్లి ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.
అయితే వేణుస్వామి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2025 ఏప్రిల్, మే మధ్యలో భూకంపం సంభవిస్తుందని ఆయన చెప్పిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. సముద్రంలో కానీ లేదా భూమి మీద కానీ ఈ ఏడాది పెద్ద భూకంపమే సంభవిస్తుందని ఆయన చెప్పారు. సముద్రంలో భూకంపం వస్తే సాధారణ భూకంపం కంటే ఎక్కువ ప్రమాదమని, సముద్రంలో భూకంపం వస్తే సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట భూకంపాన్ని చూస్తామన్నారు. రిక్టర్ స్కేల్ తీవ్రత 6పైనే ఉంటుందని జోష్యం చెప్పారు. ఆయన అన్నట్లే ఈరోజు బ్యాంకాక్, మయన్మార్‌లో భూకంపం సంభవించింది.
7.7 తీవ్రతతో భూమి ప్రకంపించింది. దీంతో పేకమేడాల్లో భారీ భవనాలు కూలిపోయాయి. తీవ్ర భయాందోళనలతో ప్రజలు ఇళ్లు, భవనాలు విడిచి పరిగెత్తారు. భూకంప కేంద్రం పొరుగున ఉన్న మయన్మార్‌లో ఉన్నట్లు జర్మనీకి చెందిన భూకంప పరిశోధనా సంస్థ గుర్తించింది. భూకంప ధాటికి బ్యాంకాక్‌తో పాటు థాయిలాండ్‌లోని ఇతర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రాణ, ఆస్తి నష్టం ఎంతదూరం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
