Solar Eclipse 2024 : వచ్చే నెల 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. అక్కడ చిమ్మ చీకట్లు
ఏప్రిల్ 8వ తేదీన ఖగోళంలో(Celestial sphere) ఓ అద్భుతం చోటు చేసుకోబోతున్నది. ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) ఆ రోజున సంభవించబోతున్నది. కొన్ని ప్రాంతాలను పూర్తిగా చీకటి కమ్మేయనుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా అమెరికా(America)లోని చాలా ప్రాంతాలలో అంధకారం అలుముకోనుంది. ఇప్పటికే వందలాది స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు.

Solar Eclipse 2024
ఏప్రిల్ 8వ తేదీన ఖగోళంలో(Celestial sphere) ఓ అద్భుతం చోటు చేసుకోబోతున్నది. ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) ఆ రోజున సంభవించబోతున్నది. కొన్ని ప్రాంతాలను పూర్తిగా చీకటి కమ్మేయనుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా అమెరికా(America)లోని చాలా ప్రాంతాలలో అంధకారం అలుముకోనుంది. ఇప్పటికే వందలాది స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. లాస్టియర్ అక్టోబర్ 14వ తేదీన ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్(Ring of Fire) తర్వాత వస్తున్న ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారు. దక్షిణ అమెరికా(America)లోని మెక్సికో(Mexico)లో ప్రారంభం కానున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని టెక్సాస్, ఓక్లాహామా, అర్కాన్‌సాస్, మిస్సౌరి, ఇల్లినాయిస్, కెంటకీ, ఇండియానా, ఓహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వెర్మాంట్, న్యూ హ్యాంప్‌షైర్, మైన్ రాష్ట్రాల మీదుగా కెనడాకు తరలనుంది. గ్రహణ సమయంలో ఈ ప్రాంతాలలో పూర్తిగా చీకట్లు కమ్ముకోనున్నాయి. అలాగే టెన్నెస్సీ, మిచిగాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం కావడం మరో విశేషం. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య తిథి రాత్రి9.12 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. తెల్లవారు జామున 1.25 గంటలకు ముగుస్తుంది. మొత్తం నాలుగు గంటలా 39 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. భారత్‌లో ఇది కనిపించదు.
