వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను(Hyderabad) ఏపీ రాజధానిగా(AP Capital City) కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖలో(Vizag) పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా(common capital) కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను(Hyderabad) ఏపీ రాజధానిగా(AP Capital City) కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖలో(Vizag) పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా(common capital) కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్య సభలోనూ ఉమ్మడి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేర్చారు. కాగా ఉమ్మడి రాజధాని గడువు త్వరలోనే ముగియనుండడంతో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం జగన్‌కే(CM Jagan) దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ పెద్ద పీట వేశారన్నారు.

Updated On 13 Feb 2024 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story