YV Subbareddy : చంద్రబాబు జైలులో ఉన్నా ప్రజలలో సానుభూతి లేదు
వైసీపీ(YCP) సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill development Case) చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత తెలుగుదేశం పార్టీకి దిక్కులేక మరో పార్టీ అధినేతపై ఆధారపడిందని అన్నారు. రూ.300 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ..
వైసీపీ(YCP) సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill development Case) చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత తెలుగుదేశం పార్టీకి దిక్కులేక మరో పార్టీ అధినేతపై ఆధారపడిందని అన్నారు. రూ.300 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జైలులో ఉన్నా ప్రజలలో సానుభూతి కనిపించడం లేదన్నారు. అందుకే బయటి రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఇబ్బందుల్లో పడిందన్నారు. అందుకే ఆ పార్టీని నడిపేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆధారపడ్డారని అన్నారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ రాజధాని లేకుండా చేశారన్నారు. విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. కేంద్రం కూడా విశాఖను గ్రోత్ హబ్ సెంటర్‌గా గుర్తించిందన్నారు. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని సుబ్బారెడ్డి అన్నారు.