YS Sharmila-CM Jagan : షర్మిలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాజీ!
వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఆ ఫ్యామిలీలోని సభ్యులకు నష్టం కలిగిస్తాయి. ఈ విషయం చాన్నాళ్లకు తెలిసి వచ్చినట్టు ఉంది. అందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి వై.ఎస్.షర్మిలతో(YS sharmila) సయోధ్య కుదుర్చుకోవాలనుకుంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP). ఈ విషయంపై షర్మిలతో రాయబారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కూడా ఓకే చెప్పారట! చెల్లెలితో విభేదాలు రాజకీయంగా తనకు నష్టం కలిగించవచ్చని జగన్ అనుకుంటున్నారట! మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని అంటున్నారు.
వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఆ ఫ్యామిలీలోని సభ్యులకు నష్టం కలిగిస్తాయి. ఈ విషయం చాన్నాళ్లకు తెలిసి వచ్చినట్టు ఉంది. అందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి వై.ఎస్.షర్మిలతో(YS sharmila) సయోధ్య కుదుర్చుకోవాలనుకుంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP). ఈ విషయంపై షర్మిలతో రాయబారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కూడా ఓకే చెప్పారట! చెల్లెలితో విభేదాలు రాజకీయంగా తనకు నష్టం కలిగించవచ్చని జగన్ అనుకుంటున్నారట! మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఇందుకు సిద్ధంగా ఉన్నదట! అయితే ఆంధ్రప్రదేశ్‌లో అన్నాచెల్లెళ్లు చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంటే అంతిమంగా అతి వైపీసీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో షర్మిలతో రాజీ కుదుర్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారట! జగన్, షర్మిల మధ్య ఉన్న విభేదాలను దూరం చేయడానికి ఫ్యామిలీలోని ఓ ముఖ్యమైన వ్యక్తి ప్రయత్నిస్తున్నారట! ఇద్దరి మధ్య సంబంధబాంధవ్యాలు పునరుద్ధరించే బాధ్యతను ఆమె తీసుకున్నారట! ముందుగా షర్మిల దగ్గరకు వెళ్లి ఆమె సమస్యలేమిటో, ఎందుకు జగన్‌తో విభేదిస్తున్నావో తెలుసుకుంటారట! అలాగే కడప లోకసభ స్థానం నుంచి వైసీపీ తరపున బరిలో నిలవాల్సింగా షర్మిలను కోరబోతున్నారు. అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించి కూడా షర్మిలకు ఎలాంటి అన్యాయం జరగకుండా పంపకాల విషయం కూడా మాట్లాడతారని తెలిసింది. అయితే షర్మిల ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతారో లేదో తెలియదు. ఒకవేళ షర్మిల ఒప్పుకున్నా కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చు.