అస‌లే ప్ర‌శాంత్ కిషోర్(Prashanth Kishore) ఎపిపోడ్‌తో రాజ‌కీయాలు హీటెక్క‌గా.. ఏపీలో(AP) మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం జ‌గ‌న్(CM Jagan) చెల్లెలు.. వైఎస్ షర్మిల(YS Sharmila) నారా లోకేష్‌కు(Nara Lokesh) క్రిస్మస్‌ కానుకలు పంపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

అస‌లే ప్ర‌శాంత్ కిషోర్(Prashanth Kishore) ఎపిపోడ్‌తో రాజ‌కీయాలు హీటెక్క‌గా.. ఏపీలో(AP) మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం జ‌గ‌న్(CM Jagan) చెల్లెలు.. వైఎస్ షర్మిల(YS Sharmila) నారా లోకేష్‌కు(Nara Lokesh) క్రిస్మస్‌ కానుకలు(Christmas Gift) పంపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. షర్మిల పంపిన కానుకలు రిసీవ్ చేసుకున్న నారా లోకేష్‌.. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్(Tweet) చేశారు. నారా ఫ్యామిలీ తరఫున ఆమెకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తార‌నే ఊహాగానాల న‌డుమ‌.. చంద్రబాబుతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ సమావేశమై 24 గంటలు గడవక ముందే ఈ ప‌రిణామం చోటుచేసుకుంది. రాజ‌శేఖ‌ర రెడ్డి, చంద్ర‌బాబు తొలినాళ్ల‌లో తాము ఇద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని చెప్పుకున్నా.. ఆ త‌ర్వాత రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. ఇది కాస్తా ప‌రిస్థితులు మారుతున్న క్ర‌మంలో వైఎస్సార్ ఫ్యామిలీ వ‌ర్సెస్‌ నారా కుటుంబంగా త‌యార‌య్యింది. వైఎస్సార్‌ మరణం తర్వాత ఆ రాజకీయం వైరం ఎక్కువైంది. ప్రస్తుతం వైఎస్ జగన్‌ అధికారంలో ఉంటే.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం పోరాడిన‌ షర్మిల.. అన్న జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్ధుల‌కు గిప్ట్స్ పంపండం రాజ‌కీయంగా తీవ్ర‌చ‌ర్చ‌కు దారితీసింది.

Updated On 25 Dec 2023 12:13 PM GMT
Ehatv

Ehatv

Next Story