YSR Sharmila : సోనియా, రాహుల్ గాంధీలను కలిశా.. ఇదే చర్చించాం.!
వైఎస్‌ఆర్‌టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీని(Sonia Gandhi) కలిశారు. దీంతో తెలుగునాట రాజకీయాలు మరింత చర్చనీయాంశమైంది. పార్టీ విలీనం గురించి ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో రెండు వారాల కిందట ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సోనియా, రాహుల్‌తో భేటీ కుదరకపోవడంతో తిరిగి వచ్చారు. తాజాగా భర్త అనిల్ కుమార్‌తో(Anil Kumar) ఢిల్లీ వెళ్లిన షర్మిల..
వైఎస్‌ఆర్‌టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీని(Sonia Gandhi) కలిశారు. దీంతో తెలుగునాట రాజకీయాలు మరింత చర్చనీయాంశమైంది. పార్టీ విలీనం గురించి ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో రెండు వారాల కిందట ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సోనియా, రాహుల్‌తో భేటీ కుదరకపోవడంతో తిరిగి వచ్చారు. తాజాగా భర్త అనిల్ కుమార్‌తో(Anil Kumar) ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సోనియా, రాహుల్ గాంధీలతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. దీంతో విలీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని అందరితో చెపుతున్నానని అన్నారు. మీడియా ప్రశ్నలు అడుగుతూ ఉంటే.. తర్వాత మాట్లాడదామని, తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.