YSRTP Leaders Resign : వైఎస్సార్టీపీ నేతలు మూకుమ్మడి రాజీనామా
వైఎస్ఆర్టీపీకి(YSRTP) నేతలు మూకుమ్మడిగా రాజీనామా(Resign) చేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) మీద గౌరవంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళను(Sharmila) నమ్ముకుంటే.. తమను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు.

YSRTP Leaders Resign
వైఎస్ఆర్టీపీకి(YSRTP) నేతలు మూకుమ్మడిగా రాజీనామా(Resign) చేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) మీద గౌరవంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళను(Sharmila) నమ్ముకుంటే.. తమను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. షర్మిల తీరుకు నిరసనగా మూకుమ్మడి గా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమను తీవ్రంగా అవమానించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజంలో వైస్ షర్మిల కు చోటు లేదన్నారు. యావత్ తెలంగాణ సమాజం షర్మిలని తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరించాలని అన్నారు. షర్మిల ఇకపై తెలంగాణను వదిలి జబర్దస్త్ షో లో పని చేయాలని.. షర్మిల కేఏ పాల్ కంటే ఆధ్వనంగా తయారయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించండి రానున్న రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
