క‌ర్ణాట‌క ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ(KPCC) అధ్యక్షుడు డీకే శివ‌కుమార్‌తో(DK Shiva Kumar) వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) భేటీ అయ్యారు. సోమ‌వారం ఉద‌యం బెంగుళూరులోని డీకే శివ‌కుమార్ నివాసంలో ఈ భేటీ జ‌రిగింది.

క‌ర్ణాట‌క ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ(KPCC) అధ్యక్షుడు డీకే శివ‌కుమార్‌తో(DK Shiva Kumar) వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) భేటీ అయ్యారు. సోమ‌వారం ఉద‌యం బెంగుళూరులోని డీకే శివ‌కుమార్ నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. ఇరువురి భేటీకి సంబంధించి వివ‌రాలు తెలియాల్సివుంది.

ఇటీవ‌ల‌ కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై షర్మిల స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంకోసం ఆ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారని, అందుకే కాంగ్రెస్‌(Congress) అధికారంలోకి వచ్చిందని అన్నారు. డీకే. శివకుమార్‌తో మాకు ఎప్ప‌టి నుంచో పరిచయం ఉందని పేర్కొన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డిని(Rajashekar Reddy) శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నార‌ని.. ఆయ‌న‌లా కష్టపడ్డారు కాబట్టే.. కర్నాటకలో అధికారంలోకి వచ్చార‌ని పేర్కొన్నారు. శివ‌కుమార్ లేకుంటే.. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదని షర్మిల ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు.

ఇదిలావుంటే.. ష‌ర్మిల త‌న‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌నున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అందుకే ఆమె కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.. నాయ‌కుల‌తో భేటీ అవుతున్నార‌నే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఈ ఊహాగానాల‌ను ఆమె ఖండించారు. విలీనం ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

Updated On 29 May 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story