ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది.

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ ఆమెపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు. కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ( MLC Madhusudan)కూడా ఓటు వేశారు. 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది.

కాగా, ''వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ(BJP)లో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.'' అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెల్సిందే. మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీ(YSRCP)లోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి (Sai Prasad Reddy)అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైసీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూసేవరకు నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.

Updated On 16 April 2025 1:00 PM GMT
ehatv

ehatv

Next Story