లోక్‌సభ సీట్లల్లో సాధించే విజయాన్ని బట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఎదురు ఉండదు

ఏపీలో ఈసారి కూడా వైఎస్సార్‌సీపీ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను అధికార వైఎస్సార్‌సీపీ 19 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ‘టీడీపీ-జనసేన’ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని టౌమ్స్‌నౌ సర్వే పేర్కొంది.

టైమ్స్‌ నౌ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పనితీరు పట్ల 38 శాతం మంది అత్యద్భుతం అని కితాబు ఇచ్చారు. మరో 26 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన బాగుందని ప్రశంసించారు. బాగాలేదని 34 శాతం తెలిపారు. ఏమీ చెప్పలేమని రెండు శాతం మంది తెలిపారు. 2019 ఎన్నికల్లో సాధించిన పట్టును ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదనే విషయాన్ని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.

లోక్‌సభ సీట్లల్లో సాధించే విజయాన్ని బట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఎదురు ఉండదు. ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి 133 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి.. వైసీపీని ఓడించాలంటే ఈ ఎన్నికల్లో అయ్యే పని కాదని టీడీపీ-జనసేన కూటమికి తెలుస్తోంది.

Updated On 7 Feb 2024 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story