Jagan visit to Tirumala:జగన్ తిరుమల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం అంటే 27వ తేదీన తిరుమలకు వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం అంటే 27వ తేదీన తిరుమలకు వెళుతున్నారు. కాలి నడకన ఆయన తిరుమల చేరుకుంటారు. శనివారం, 28వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. జగన్ తిరుమల పర్యటన సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం తిరుమలలో స్వాములు నిరసనకు దిగడమే! గో బ్యాక్ జగన్ అంటూ అలిపిరి(Alipiri ) దగ్గర శ్రీనివాస ఆనంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు ఆందోళనకు చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్ల కార్డులతో నినాదాలు చేశారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామంటున్నారు. జగన్ పర్యటనలో శాంతి భద్రతల సమస్య వస్తే అందుకే జగనే బాధ్యత తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, జగన్ పర్యటనను వైసీపీ నాయకులు(YCP Leaders), కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా(Chitoor District) తెలుగుదేశం పార్టీ(TDP) నేతలు పిలుపునివ్వడంతో వైసీపీ క్యాడర్ కూడా అలెర్టయ్యింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తిరుమల శ్రీవారిని తమ నాయకుడు వైఎస్ జగన్ (YS Jagan)దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తే, దీటుగా తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.