ఏపీలో వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు(Social media Activist) ప్రభుత్వం షాక్‌ ఇస్తోంది.

ఏపీలో వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు(Social media Activist) ప్రభుత్వం షాక్‌ ఇస్తోంది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు(Legal action) ప్రభుత్వం పూనుకుంది. వైసీసీ కార్యకర్తలను(YCP Leaders), మద్దతుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 680 మంది నోటీసులు ఇచ్చారు. 147 కేసులు నమోదు చేశారు. 49 మందిని అరెస్టు(Arrest) చేశారు. అయితే ఈ అరెస్టులను వైసీపీ ఖండిస్తోంది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసుకొని తామే పోస్టులు పెట్టి వైసీపీ కార్యకర్తలపై నెపం నెట్టి కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఏపీ డీజీపీకి(AP DGP) పలువురు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ నేతలు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో అరాచకాలకు పాల్పడుతున్నారని.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సోషల్‌ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధైర్యం చెబుతున్నారు. న్యాయసహాయంతో పాటు అన్నిరకాలుగా సాయం అందించేందుకు విభాగాలను ఏర్పాటు చేయించారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు అధైర్య పడొద్దని.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్‌ హామీ ఇచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story