వైసీపీ సిద్ధం సభలకు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

వైసీపీ సిద్ధం సభలకు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
వైసీపీ సిద్ధం సభలకు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీగా జనసమీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 సభలు సక్సెస్ అయ్యాయి. ఒకదానికి మించి మరో సిద్ధం సభ సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగో, చివరి సభ అద్దంకిలో నిర్వహించనున్నారు. మార్చి 10వ తేదీన అద్దంకి వేదికగా ఆఖరి సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు 15లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
వైసీపీ, భీమిలీ, దెందులూరు, రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించింది. నాలుగో సభకు మరింత ఎక్కువగా వస్తారనే అంచనా ఉంది. ఈ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తారని తెలిసింది.
