YSRCP : వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదల
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ(YSRCP) పార్టీ. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. శ్రీకాకుళం(Srikakulam), చిత్తూరు(Chittoor), కర్నూలు(Kurnool) జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ.. ఎస్సీ(SC), బీసీ(BC)లకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీ(ZPTC)గా ఉన్న ఉప్పాడ నారాయణమ్మ(Uppada Narayanamma)ను శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్(ZP Chairman)గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకాకుళం (ఎంపీ) పేరాడ తిలక్
విశాఖపట్నం (ఎంపీ) బొత్స ఝాన్సీ లక్ష్మి
ఏలూరు (ఎంపీ) కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ (ఎంపీ) కేశినేని నాని
కర్నూలు (ఎంపీ) గుమ్మనూరి జయరాం
తిరుపతి (ఎంపీ కోనేటి ఆదిమూలం
ఇచ్చాపురం పిరియ విజయ
టెక్కలి దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్పీ) కంభం విజయ రాజు
రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి
దర్శి బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) మూతిరేవుల సునీల్‌కుమార్
చిత్తూరు విజయానందరెడ్డి
మదనపల్లె నిస్సార్ అహ్మద్
రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
ఆలూరు బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) మద్దిల గురుమూర్తి
పెనమలూరు జోగి రమేశ్
పెడన ఉప్పాల రాము
శ్రీకాకుళం ఉప్పాడ నారాయణమ్మ(జెడ్పీ చైర్మన్)