ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల పెంపు పై వై.ఎస్.ఆర్.సి.పి. ధర్నా చేపట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని విద్యుత్ కార్యాలయాల ముంగిట ధర్నాకు పిలుపునిచ్చింది వై.సి.పి.. ఇందులో భాగంగా నే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేస్తూ.. పోరుబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లో ప్రజలపై భారం మోపుతుందని, దాదాపు 15 వేల కోట్ల వరకు చార్జీల భారం ప్రజలపై పడిందని వై. సి. పి. విమర్శిస్తోంది. హామీల అమలు చేయకపోగా ప్రజలను ఇలా ఇబ్బందికి గురి చేస్తున్నారని వైఎస్సార్ పార్టీ నిరసనకు దిగింది.

మరో వైపు జగన్ తను పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని.. తనే ధర్నా చేస్తున్నారని టి. డి. పి. వర్గాలు అంటున్నాయి. ప్రజల్లో తమకు దక్కిన మద్దతును తట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story