Raghu Rama Krishnam Raju Is Next Target..? || నెక్స్ట్ రఘు రామే..కమలం వైపేనా..? || Journalist YNR
వైసీపీ రెబల్ ఎంపీగా ఉంటూ, సీఎం జగన్ (CM Jagan) అలాగే పార్టీపై ఎప్పటికప్పుడు వాదనలు చేస్తూ తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటారు.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేసినందుకు రఘురామను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన సంగతి తెలిసిందే. కాని ఇంతవరకు ఆయనను పార్టీ నుంచి తొలగించలేదు వైసీపీ అధిష్టానం. తాజాగా క్రాస్ ఓటింగ్ వేశారని నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైసీపీ.. ఇప్పుడు రఘురామాపైన కూడా వేటు వేసే ఆలోచనలో ఉందట.. ఒకవేళ అదే జరిగితే రఘురామా పరిస్థితి ఏంటి.. అయన నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది.

ysrcp plan to suspend rebel mp raghurama krishnam raju
ఎమ్మెల్యే కోటా(MLA Quota)లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్‌లో క్రాస్ ఓటింగ్(Cross Voting)కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP). విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తెలిపారు. అయితే తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజుపై (Raghu Rama Krishnam Raju) వైసీపీ సస్పెన్షన్ వేటు వేస్తుందని తెలుస్తుంది... వైసీపీ రెబల్ ఎంపీగా ఉంటూ, సీఎం జగన్ (CM Jagan) అలాగే పార్టీపై ఎప్పటికప్పుడు వాదనలు చేస్తూ తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటారు.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేసినందుకు రఘురామను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన సంగతి తెలిసిందే. కాని ఇంతవరకు ఆయనను పార్టీ నుంచి తొలగించలేదు వైసీపీ అధిష్టానం. తాజాగా క్రాస్ ఓటింగ్ వేశారని నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైసీపీ.. ఇప్పుడు రఘురామాపైన కూడా వేటు వేసే ఆలోచనలో ఉందట.. ఒకవేళ అదే జరిగితే రఘురామా పరిస్థితి ఏంటి.. అయన నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది.
