ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో(YCP) అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా(Roja), ఇటు గుంటూరులో అంబటి రాంబాబు(Ambati Rambabu), విడదల రజనీ(Rajani), విశాఖలో అవంతి(Avanthi), గోదావరిలో పిల్లి చంద్రబోస్(Pilli Chandra Bose) ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తోంది . కాస్త బుజ్జగించి, మరికాస్త లాలించి ఈ నేతలను శాంతిపజేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్న.

వైసీపీలో కాకరేపుతున్న పిల్లి సుభాష్ వ్యాఖ్యలు
వైసీపీలో తారాస్థాయికి చేరిన అంతర్గత కుమ్ములాటలు
జగ్గంపేట వైసీపీలో ముసలం
మాజీ మంత్రి తోట నరసింహం వర్సస్‌ ఎమ్మెల్యే చంటిబాబు
ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో పేచీలతో తలపట్టుకుంటున్న వైసీపీ అధిష్ఠానం

ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో(YCP) అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా(Roja), ఇటు గుంటూరులో అంబటి రాంబాబు(Ambati Rambabu), విడదల రజనీ(Rajani), విశాఖలో అవంతి(Avanthi), గోదావరిలో పిల్లి చంద్రబోస్(Pilli Chandra Bose) ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తోంది . కాస్త బుజ్జగించి, మరికాస్త లాలించి ఈ నేతలను శాంతిపజేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్న. ఈ అంతర్గత చిచ్చు తగ్గినట్లే తగ్గి మళ్ళీ రాజుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరికి వారి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు ఆల్టిమేటాలు జారీ చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామచంద్రాపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇక్కడ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి జగన్ తోనే ఉన్న పిల్లిని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారు. అయితే, ఆ తర్వాత మండలి రద్దు చేస్తానంటూ పిల్లితో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ఈసారి ఎలాగైనా రామచంద్రపురం నుండి తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన ఈసారి కూడా తనకే టికెట్ ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొంత కాలంగా ఇక్కడ వార్ నడుస్తుంది. ఇప్పటికే పిల్లి సుభాష్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయనున్నట్లు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ పెద్దలు ఈ విషయంపై పిల్లి సుభాష్, ఎమ్మెల్యే చెల్లుబోయినతో సంప్రదింపులు జరిపి సీఎం జగన్ వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే చెల్లుబోయినను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నట్లు కూడా ఊహాగానాలు బయటకొచ్చాయి. దీంతో పిల్లి అప్పటికి కాస్త శాంతించినట్లు కనిపించారు. కానీ ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తగ్గేదేలే అంటూ బయటకొచ్చారు.

తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తేల్చి చెప్పారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అవుతారని, కార్యకర్తల అభీష్టాన్ని సీఎంకు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని, తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. కానీ ఎమ్మెల్యే చెల్లుబోయిన మాత్రం చాపకింద నీరులాగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఈ సమస్య నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది. మొత్తం మీద రామచంద్రాపురంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు జగన్ కు తలనొప్పిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు.

కాకినాడ జిల్లా వైసీపీలో మరో ముసలం :
కాకినాడ జిల్లా వైసీపీలో మరో ముసలం ముదిరింది. ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఆరని పేచీలతో తలపట్టుకుంటున్న అధిష్ఠానానికి తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి తోటనరసింహం పావులు కదుపుతుండడంతో పార్టీలో వర్గాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ తనదేనంటూ తోట ఎక్కడి కక్కడ వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండడం నియోజక వర్గంలో కాకరేపుతోంది. అటు ఎమ్మెల్యే చంటిబాబు వర్గానికీ చిర్రెత్తిస్తోంది. మరోపక్క నరసింహానికి మద్దతుగా ఆయన తనయుడు వరుస సవాళ్లు విసురుతుండడం మరింత కాక రాజేస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని టిక్కెట్‌ తనదే నంటూ తోట ప్రచారం చేసుకుంటుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆత్మీయ సమావేశాలతో కాక :
తమ పార్టీకి కంచుకోటగా భావించే జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పుడు ముసలం రాజుకోవడంతో వైసీపీ తలపట్టుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గంలో స్పీడు పెంచడం విభేదాలను రాజేస్తోంది. వచ్చేఎన్నికల్లో తాను ఇక్కడినుంచే పోటీ చేస్తానని, టిక్కెట్‌ తనదేనని, అధినేత జగన్‌ ఆశీస్సులు పుష్కలంగా తనకే ఉన్నాయంటూ తోట నరసింహం పదే పదే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.

ఎవరి ధీమా వారిది :
2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి తోట నరసింహం రెండుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు అధిష్టించారు. ఆ తర్వాత 2014లో జగ్గంపేట నుంచి వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల చంటిబాబుకు సీటు లభించడంతో నరసింహం జగ్గం పేటను వదులు కోవాల్సి వచ్చింది. దీంతో టీడీపీలో చేరి కాకినాడ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి నరసింహం వైసీపీలో చేరారు.జగ్గంపేట వైసీపీ సీటు చంటిబాబుకు రావడం, ఆపై అనారోగ్యం బారిన పడడంతో నర సింహం తన భార్యకు పెద్దాపురం వైసీపీ సీటు తెచ్చుకున్నారు. తీరా ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో నరసింహం తనకు అచ్చొచ్చిన జగ్గంపేటనుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.ఎమ్మెల్యే చంటిబాబును కాదని నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడం ఇప్పుడు ముసలం రాజేస్తోంది.

Updated On 30 Aug 2023 4:26 AM GMT
Ehatv

Ehatv

Next Story