కొన్ని జ్ఞాపకాలను వదిలేస్తూ నిర్దయగా కాలం కరిగిపోతూనే వుంటుంది. ఆ స్మృతుల్లో కొన్నింటిని పదిలంగా దాచుకోవాలనిపిస్తుంది. పదే పదే తలచుకోవాలనిపిస్తుంది. ఎప్పటికీ ఎనాటికీ కరిగిపోని సాక్ష్యం ఒక్కటే. అది ఫోటో(Photo). భావాన్ని వ్యక్తపర్చడానికి వేన వేల పదాలు అవసరం లేదు. ఒక్క ఛాయా చిత్రం చాలు.

కొన్ని జ్ఞాపకాలను వదిలేస్తూ నిర్దయగా కాలం కరిగిపోతూనే వుంటుంది. ఆ స్మృతుల్లో కొన్నింటిని పదిలంగా దాచుకోవాలనిపిస్తుంది. పదే పదే తలచుకోవాలనిపిస్తుంది. ఎప్పటికీ ఎనాటికీ కరిగిపోని సాక్ష్యం ఒక్కటే. అది ఫోటో(Photo). భావాన్ని వ్యక్తపర్చడానికి వేన వేల పదాలు అవసరం లేదు. ఒక్క ఛాయా చిత్రం చాలు. రెక్కలు తొడుక్కుని ఎగిరిపోయే కాలం అనుభూతులు, అనుభవాలు, చెదిరిపోని జ్ఞాపకాలు, చెరగని విషాదస్మతులనే మనసనే మన గూడులో భద్రంగా వదిలివెళుతుంది.వాటన్నింటినీ బంధించి చెదిరిపోకుండా కలకాలం నిలిచివుండేది ఫోటో మాత్రమే. గత కాలపు ముచ్చట్లు, అచ్చట్లు ఎవరికైనా మధురంగా ఉంటాయి. ఆ మధురానుభవాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSR Congress ) ఎంపీ విజయ్‌సాయిరెడ్డి(MP Vijay Sai reddy) నెటిజన్లతో పంచుకున్నారు. ఎక్స్‌ (Twitter)లో తను చదువుకునే రోజుల్లో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఆ ఫోటోలో విజయ్‌సాయిరెడ్డిని గుర్తుపట్టడం కష్టమే! చదువుకునే రోజుల్లో తన స్వస్థలం నెల్లూరులో మిత్రులతో కలిసి దిగిన ఫోటో ఇదని, ఇందులో ప్రస్తుత రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు కూడా ఉన్నారని విజయ్‌సాయిరెడ్డి రాసుకొచ్చారు. ఆ రోజులను ఎప్పుడు తలుచుకున్నా అద్భుత జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతాయని చెప్పుకొచ్చారు.

Updated On 4 April 2024 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story