YSRCP : వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌలి గుడ్‌బై?
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Balashowry ) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. రేపోమాపో ఆయన జనసేనలో(Janasena) చేరబోతున్నారు. పవన్‌కల్యాణ్‌తో భేటీకానున్నారు. మచిలీపట్నం లోక్‌సభ నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు అవనిగడ్డ(Avanigadda) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తన కుటుంబసభ్యులలో ఒకరిని బరిలో దింపాలని అనుకుంటున్నారు.

balashowry
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Balashowry ) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. రేపోమాపో ఆయన జనసేనలో(Janasena) చేరబోతున్నారు. పవన్‌కల్యాణ్‌తో భేటీకానున్నారు. మచిలీపట్నం లోక్‌సభ నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు అవనిగడ్డ(Avanigadda) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తన కుటుంబసభ్యులలో ఒకరిని బరిలో దింపాలని అనుకుంటున్నారు. తన సోషల్ మీడియాలో(Social Media) అకౌంట్‌లో జగన్మోహన్‌రెడ్డి ఫోటో కాకుండా కేవలం రాజశేఖర్‌రెడ్డి ఫోటోలతో పోస్టులు పెడుతున్నారు బాలశౌరి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను(YSRCP) ఆయన విడిచిపెడుతున్నారనడానికి ఇది సంకేతం. ఇప్పటికే చాలా మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అధిష్టానం సిట్టింగులను మార్చడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు(MLAs), ఎంపీలు(MOs) పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్(Sanjeev Kumar) ఆల్‌రెడీ రాజీనామా చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కూడా పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట!
