టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chnadrababu), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ల(Prashanth Kishore) భేటీపై(Bhatti Vikramarka) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో పాల్లొన్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chnadrababu), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ల(Prashanth Kishore) భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో పాల్లొన్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిశోర్ ను తాము వదిలేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు పట్టుకున్నారని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. ప్రశాంత్ కిశోర్ కూడా చేసేదేమీ లేదని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎల్లో మీడియా అండగా ఉందని.. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు.

జగన్(Jagan) సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసిందేమీ లేదని.. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని పేర్కొన్నారు.

Updated On 26 Dec 2023 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story