M.V.V Sathyanarayana : వ్యాపారాన్ని హైదరాబాద్‌కు మార్చనున్న విశాఖ ఎంపీ.?
విశాఖ(Vishkapatnam) నగరానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) లోక్‌సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ(MVV Sathyanarayana) తన వ్యాపారాన్ని(Business) హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తన కుమారుడు శరత్ చంద్ర(Sharath Chandhra), భార్య జ్యోతి(Jyothi), ఆయన ఆడిటర్ జీవీని నగరంలోని ఒక రౌడీ షీటర్, అతని ముఠా కిడ్నాప్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విశాఖ(Vishkapatnam) నగరానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) లోక్‌సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ(MVV Sathyanarayana) తన వ్యాపారాన్ని(Business) హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తన కుమారుడు శరత్ చంద్ర(Sharath Chandhra), భార్య జ్యోతి(Jyothi), ఆయన ఆడిటర్ జీవీని నగరంలోని ఒక రౌడీ షీటర్, అతని ముఠా కిడ్నాప్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా(Executive capital) ప్రకటించి, సెప్టెంబర్‌లో నగరం నుంచే కార్యకలాపాలు సాగిస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. సత్యనారాయణ నగరం విడిచి హైదరాబాద్‌లో స్థిరపడాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో రాజకీయాలు, వ్యాపారాలు కొనసాగించడం కష్టంగా మారిందని ఎంపీ వాపోయినట్లు తెలుస్తోంది. తాను రాజకీయ నాయకుడన్న కారణంగా తనపై వ్యాఖ్యలు చేసినా బాధపడ్డానని ఎంపీ పలువురితో చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వార్తలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించాల్సివుంది.