YSRCP Leader Attack on MPDO : అన్నమయ్య జిల్లాలో అంకుశం రామి రెడ్డి సీన్ రిపీట్..
అన్నమయ్య జిల్లాలో.. అంకుశం సినిమాలోని రామి రెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లే లాంటి సీన్ కనబడింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు లో ఎంపిడిఓ పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. సంబంధిత పోలీస్ స్టేషన్ సి. ఐ. కొండా రెడ్డి, ఎంపిడిఓ పై దాడి చేసిన, వై. సి.పి. నేత సుదర్శన్ రెడ్డి పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే సదరు సి. ఐ. కొండారెడ్డి వై.సి.పి. నేతను చొక్కా పట్టుకుని లాక్కొని వెళ్ళడం సంచలనంగా మారింది. ఈ సంఘటన ఒకప్పటి హిట్ సినిమా అయిన అంకుశం లోని సీన్ ను గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో పోలీస్ అయిన రాజశేఖర్, తప్పు చేసిన విలన్ రాణి రెడ్డిని ఇలాగే రోడ్డుపై లాక్కొని వెళుతూ.. చొక్కా పట్టుకుని కొడుతూ తీసుకెళతాడు.
మరో వైపు దాడికి గురైన ఎంపిడిఓ కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మినిష్టర్ అయిన పవన్ కళ్యాణ్, ఎంపీడీవో ను పరామర్శించనున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.