ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. అభ్యర్థుల మార్పుపై వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) తీసుకుంటున్న నిర్ణయాలు సంచలన సృష్టిస్తున్నాయి. తొలి జాబితాలో ముగ్గురు మంత్రులను(Ministers) మార్చిన జగన్.. తాజాగా రెండో జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండో జాబితాలోనూ పలువురు ఎమ్మెల్యేల(MLA) పేర్లు ఉన్నట్టు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను(Gudiwada amarnath) అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. అలాగే కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను(Taneti Vanitha) గోపాలపురం (ఎస్సీ)కి బదిలీ చేసే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. అభ్యర్థుల మార్పుపై వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) తీసుకుంటున్న నిర్ణయాలు సంచలన సృష్టిస్తున్నాయి. తొలి జాబితాలో ముగ్గురు మంత్రులను(Ministers) మార్చిన జగన్.. తాజాగా రెండో జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండో జాబితాలోనూ పలువురు ఎమ్మెల్యేల(MLA) పేర్లు ఉన్నట్టు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను(Gudiwada amarnath) అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. అలాగే కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను(Taneti Vanitha) గోపాలపురం (ఎస్సీ)కి బదిలీ చేసే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూపును(Viswaroop) తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను(Chinta anuradha) బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు జోగి రమేశ్‌ (పెడన)(Jogi Ramesh), అంబటి రాంబాబు(Ambati Rambabu) (సత్తెనపల్లి)లకు స్థాన చలనం తప్పదంటున్నారు. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాం(Gummanuri jayaram) స్థానాన్ని మార్చటం లేదా లోక్‌సభ అభ్యర్థిగా పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును(Dorababu) తప్పించి.. కాకినాడ ఎంపీ వంగా గీతకు(Vanga geeta) టికెట్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను(Venugopal), అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని(Ananta venkataramreddy) లోక్‌సభకు పంపే అవకాశాలున్నాయి.

వీరితోపాటుగా సీట్లు మార్చే స్థానాల్లో పలువరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శెట్టి ఫాల్గుణ(Shetty phalguna) (అరకు-ఎస్టీ), కన్నబాబురాజు(Kannababu raju) (యలమంచిలి), గొల్లబాబూరావు(Golla babu rao) (పాయకరావుపేట) పి.ఉమాశంకర్‌ గణేశ్‌(Uma shankar ganesh) (నర్సీపట్నం), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ (పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), తలారి వెంకటరావు (గోపాలపురం-ఎస్సీ), రక్షణనిధి (తిరువూరు-ఎస్సీ), సింహాద్రి రమేశ్‌బాబు (అవనిగడ్డ), మల్లాది విష్ణు(Malladi vishnu) (విజయవాడ సెంట్రల్‌), , కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), వి.వరప్రసాదరావు (గూడూరు), ఆర్థర్‌ (నందికొట్కూరు), సుధాకర్‌ (కోడుమూరు), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకట్రామిరెడ్డి9Venkatramireddy) (గుంతకల్‌), తిప్పేస్వామి (మడకశిర), శ్రీధర్‌రెడ్డి (పుట్టపర్తి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), శ్రీనివాసులు (చిత్తూరు), వెంకటగౌడ (పలమనేరు)లను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated On 14 Dec 2023 8:11 AM GMT
Ehatv

Ehatv

Next Story