YSRCP Letter GAD : తొందరగా ఫర్నీచర్‌ను పట్టుకెళ్లండి... జీఏడీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేఖ
జీఏడీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేఖ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఫర్నీచర్ కొనుగోలు చేశారని, ప్రభుత్వం మారినప్పటికీ వాటిని తిరిగి అప్పగించలేదని తెలుగుదేశంపార్టీ(TDP) శ్రేణులు ఆరోపణలు చేసిన వెంటనే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఫర్నీచర్‌ను(Furniture) వెంటనే తమకు అప్పగించాలని జగన్‌కు లేఖ రాశారు. అయితే ఫర్నీచర్‌ను పట్టుకెళ్లడంటూ ఇప్పటికీ నాలుగు సార్లు జీఏడీకి(GDA) లేఖలు రాసింది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్. అయినప్పటికీ ఆ శాఖ అధికారులు రియాక్టవ్వడం లేదు. లేటెస్ట్‌గా క్యాంపు ఆఫీసులోని ఫర్నీచర్‌పై బుధవారం జీఏడీకి లేఖ రాశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి. క్యాంప్ ఆఫీసును పార్టీ ఆఫీసుగా మార్చినందున వెంటనే ఫర్నీచర్‌ను తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థించారు. ఎప్పటిలోగా తీసుకెళ్లేది చెప్పాలంటూ లేఖలో పేర్కొన్నారు. పట్టుకెళ్లే ఉద్దేశం లేకపోతే ఫర్నీచర్‌కు ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తామని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి!