Vijayasai Reddy to Join BJP? : బీజేపీలోకి విజయసాయిరెడ్డి..జగనే పంపిస్తున్నాడా.?
ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోవడం చాలా కష్టం.

ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోవడం చాలా కష్టం. దూరంగా ఉందామని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా.. మళ్లీ మళ్లీ పాలిటిక్స్ వైపే చూస్తుంటారు.. ఇప్పుడు అదే కోవలోకి వస్తునారు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన సాయిరెడ్డి రాజకీయ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూనే ఉన్నారు.. ఆయన కొత్త పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.
తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పారు. ఇప్పుడే అదే పెద్ద చర్చగా మారింది ఈ క్రమంలోనే లేటెస్ట్ గా అయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కలిశారు, ఆయనతా చాలాసేపు ముచ్చటించారు. జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని చాలామంది చెవులు కోరుకుంటున్నారు. అంతే కాదు దానికోసం ఒక డేట్ టైం ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారట. ఈ ఏడాది జూన్, లేదా జులైలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకుంటారంట టాక్ వినిపిస్తుంది. నిజానికి బీజేపీ పెద్దలతో విజయసాయికి మంచి రిలేషన్ ఉంది, ఢిల్లీ రేంజ్ లో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి
ఇక మరో వైపు విజయసాయిరెడ్డిని జగనే బీజేపీలోకి పంపుతున్నారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది.. ఎన్నికల నాటికి బీజేపీ,వైసీపీని కలపడానికి విజయసాయిరెడ్డిని పావులా వాడుతున్నారని ప్రచారం కూడా ఉంది.. అది కుదరకపోతే పవన్ ని పెంచి టీడీపీని లేకుండా చేయాలనే రాజకీయం కూడా నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది.
