ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యపూరిత వ్యాఖ్యలతో సుతిమెత్తగా తిట్టిపోశారు.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యపూరిత వ్యాఖ్యలతో సుతిమెత్తగా తిట్టిపోశారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంవల్లే మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు. తెలుగుదేశంపార్టీ(TDP)లో చేరడానికి విజయసాయిరెడ్డి(Vijaya sai reddy) ప్రయత్నించారంటూ అచ్చెన్నాయుడు(Atchannaidu)చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ఎక్స్‌ వేదికగా విజయసాయిరెడ్డి ఓ పెద్ద పోస్ట్‌ పెట్టారు. తెలుగుదేశం పార్టీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అంటూ ప్రశ్నించారు.

'అచ్చంనాయుడూ! దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి.. కచ్చి.. అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా’ అంటూ విజయ సాయిరెడ్డి కామెంట్‌ చేశారు.

ehatv

ehatv

Next Story