మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో నందిగం సురేష్ అరెస్ట్ అనివార్యమైంది. నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌ నుంచి మంగళగిరి తరలించి.. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత‌లు దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, త‌లశిల ర‌ఘురామ్ త‌దిత‌రులు అంద‌రూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డంతో గుంటూరు, బాప‌ట్ల‌, ప‌న్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story