రామగిరి ఎస్సై సుధాకర్(Ramagiri SI Sudhakar), వైఎస్ జగన్‌(Ys Jagan)ను ఉద్దేశించి "యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు, రాజ్యాంగం మాకిచ్చిన గౌరవం అది.

రామగిరి ఎస్సై సుధాకర్(Ramagiri SI Sudhakar), వైఎస్ జగన్‌(Ys Jagan)ను ఉద్దేశించి "యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు, రాజ్యాంగం మాకిచ్చిన గౌరవం అది. నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఇది అరటితొక్క కాదు. జాగ్రత్తగా మాట్లాడు" అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్‌ మీడియా(Ycp Social Media) కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ(TDP) నేతలతో ఫొటోలు దిగి వారికి సన్నిహితంగా ఉన్నది నీవు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఎస్సై సుధాకర్ యాదవ్ ఇచ్చిన వార్నింగ్‌కు తోపుదుర్తి కౌంటర్‌ ఇచ్చారు.నీ పరిధి రామగిరి దాటి పెనుగొండ (Penugonda)వెళ్లి వైసీపీ పార్టీ MPTC లను ప్రలోభ పెట్టింది నిజం కదా? ఇలా చేయమని నీ ఖాకి చొక్కా నేర్పించిందా? ప్రజల పక్షాన నిలబడతావని, అన్యాయంపై పోరాడతావని నీకు ఖాకి చొక్కా ఇస్తే, నీ స్వలాభం కోసం రామగిరి శాంతి భద్రతలను తాకట్టు పెట్టలేదా? అంటూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(Thopudurthi Prakash Reddy) ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story