టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ప్రజాగళం

గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. "చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నాం" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, ఇవాళ తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా చేతకాని పిరికిపందలు రాళ్లు వేశారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారు అని చంద్రబాబు వెల్లడించారు. రాయి పడడంతో చంద్రబాబు ప్రసంగం ఆపారు. వాళ్లు దొరికితే తరిమి తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు

Updated On 14 April 2024 8:58 PM GMT
Yagnik

Yagnik

Next Story