ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ఆవేదన చెందారు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ఆవేదన చెందారు. బుధవారం ఢిల్లీ(Delhi) జంతర్‌మంతర్‌లో(Jantar Mantar) ధర్నా చేపట్టడానికి ముందు జగన్‌ ప్రెస్‌తో ముచ్చటించారు. ఏపీలో తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అరాచకాలు జరుగుతున్నాయని జగన్‌ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు(Political Murders) జరిగాయని వివరించారు. వందల ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారని చెప్పారు. తమ పార్టీకి చెందిన నాయకులపై వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని జగన్‌ పేర్కొన్నారు.

గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారని, తమ హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆవేదన చెందారు. నారా నారా లోకేశ్‌(Nara Lokesh) రెడ్‌బుక్‌(Red book) పేరుతో హోర్డింగ్‌లు పెట్టారని, తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని జగన్‌ ఆరోపించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story