ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాక్షసరాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాక్షసరాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనానికి వెళతామంటే అడ్డుకునే రాజకీయాన్ని ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు. నోటీసులు(Notices) ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని జగన్‌ ధ్వజమెత్తారు. జగన్‌ పర్యటనలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ తమ పార్టీ క్యాడర్‌కు నోటీసులు ఇచ్చారని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందనడానికి ఇంతకు మించి ఉదాహరణ అక్కర్లేదని అన్నారు. మాజీ సీఎంకు దేవుడిని దర్శించుకునే హక్కు లేదని అంటున్నారని, ఇది రాక్షస రాజ్యం కాదా అని జగన్‌ ప్రశ్నించారు. లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్‌ అంశాన్ని తెరమీదకు తెచ్చారని జగన్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారని, బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసో తెలియదోనని జగన్ అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని పునరుద్ఘాటించారు జగన్‌. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా రుజువు చేస్తానని జగన్‌ వివరించారు. వంద రోజుల తప్పుడు పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డూను తెరమీదకు తెచ్చారని, . తిరుమలలో తప్పుడు చేయడానికి ఆస్కారం లేని వ్యవస్థలు ఉన్నాయన్నారు.

జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని జగన్‌ విమర్శించారు. రాజకీయ దుర్భుద్దితోనే కల్తీ జరిగిందని అసత్యమాడుతున్నారని చెప్పారు. 'తిరుపతిలో నెయ్యి కొనుగోలు కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. ఎల్‌1గా ఎవరు వచ్చారో వారికే టెండర్లు ఇస్తారు. దశాబ్దాలుగా ఈ ప్రక్రియనే జరుగుతోంది. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఎబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ తెచ్చిన తర్వాత కూడా టీటీడీ మూడు పరీక్షలు చేస్తుంది. ఒక్క పరీక్ష ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. చంద్రబాబు హయంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. మా హయాంలో 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపాం. తిరుమలలో ఇంత గొప్ప వ్యవస్థ ఉంది. జులై 6, 12వ తేదీలలో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయ్యాయి. ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్ అయితే మైసూర్‌లో ఉన్న ల్యాబ్‌కు పంపుతారు. కానీ మొదటిసారి ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపించారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందని చెప్పారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు. కల్తీ నెయ్యి లడ్డూలకు వాడలేదని ఈ నెల 20వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్టుగా ఉంది. అయినా సరే చంద్రబాబు కల్తీ నెయ్యి కలిసిందని పచ్చి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు' అని జగన్‌ అన్నారు.


Updated On 28 Sep 2024 5:49 AM GMT
Eha Tv

Eha Tv

Next Story