వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నేడు ప్రకటించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ఆయన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. సీఎం జగన్ ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

2019లో జరిగినట్లుగానే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి పాటిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 77 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 23 పార్లమెంట్ నియోజకవర్గాలకు 12 జాబితాల ద్వారా ఇంచార్జులను నియమించారు.

Updated On 15 March 2024 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story