ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తూ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తూ వస్తోంది వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. వైసీపీ 8వ జాబితాలో.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోషయ్య, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళి, కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్, జీ.డి.నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్‌ కృపాలక్ష్మి.

కర్నూలు ఎంపీ అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధిష్టానం పిలిపించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసింది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన నిరాకరించడంతో బీవై రామయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది. సీఎం వైఎస్ జగన్‌ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన ఇంతియాజ్ అహ్మద్ కలవనున్నారు. ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు బీవై రామయ్య కూడా సీఎంను కలవనున్నారు. బీవై రామయ్య, ఇంతియాజ్ అహ్మద్‌కు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

Updated On 28 Feb 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story