Raghu Ramkrishna Raju : తండ్రి కొడుకుల గుట్టు రఘురామ చేతిలో ఉందా? అందుకేనా ఆ భయం!
మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజు(Raghu ramkrishna raju) పచ్చ కండువా మెడలో వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి(TDP) జై కొట్టారు. చంద్రబాబును దేవుడన్నారు. ఇప్పుడాయనకు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం(Undi assembly constituency) టికెట్ దక్కడమే తరువాయి! నరసాపురం(Narsapuram) లోక్‌సభ టికెట్ కోసం చాలా ప్రయత్నించారు రఘురామకృష్ణరాజు. కూటమిలో ఉన్న పార్టీలలో ఏ ఒక్కటి కూడా ఆయన వంక కన్నేత్తి కూడా చూడలేదు.
మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజు(Raghu ramkrishna raju) పచ్చ కండువా మెడలో వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి(TDP) జై కొట్టారు. చంద్రబాబును దేవుడన్నారు. ఇప్పుడాయనకు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం(Undi assembly constituency) టికెట్ దక్కడమే తరువాయి! నరసాపురం(Narsapuram) లోక్‌సభ టికెట్ కోసం చాలా ప్రయత్నించారు రఘురామకృష్ణరాజు. కూటమిలో ఉన్న పార్టీలలో ఏ ఒక్కటి కూడా ఆయన వంక కన్నేత్తి కూడా చూడలేదు. ఆ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ వైసీపీ రెబల్ ఎంపీ టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ అసహనంతోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మండిపడ్డారు. పనిలో పనిగా చంద్రబాబును కూడా నాలుగైదు మాటలు అనేశారు. తనకు టికెట్ అయినా ఇప్పించలేని చంద్రబాబునాయుడు(Chandrababu) పోలవరం ప్రాజెక్టుకు(Polavaram Project) నిధులు ఎలా తెస్తారంటూ నిలదీశారు. ఈ నిలదీత కార్యక్రమం జరిగిన కాసేపటికే టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనకు ఉండి అసెంబ్లీ ఇవ్వాల్సిన భారం చంద్రబాబుపై ఉంది. రఘురామ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిని పక్కకు జరపాల్సి వస్తుంది. చంద్రబాబు ఇలాంటి పనుల్లో సిద్ధహస్తులు కాబట్టి మొహమాటం లేకుండా రఘురామ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు హ్యాండివ్వగలరు. అయినా రఘురామకృష్ణరాజుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నట్టు? ఇంతకాలం జగన్‌ను(Jagan) తిట్టిపోసినందుకా? టీడీపీ అనుకూల మీడియాకు కాసింత మేత పెట్టినందుకా? ఇవేవీ కాదంటే మాత్రం ఇంకేదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉండాలి. రఘురామకృష్ణరాజు చేతిలో చంద్రబాబు,లోకేశ్ బాబుకు సంబంధించిన రహస్యాలేవో ఉండి ఉంటాయని, అందుకే చంద్రబాబు ఆయన చెప్పినట్టు వింటున్నారని తెలుగుదేశంపార్టీ నేతలే అనుమానిస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు అందుకే తండ్రికొడుకులు జడుసుకుంటున్నారన్నది టీడీపీ నేతల భావన!